పుట:రమ్యా లోకము.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకముపచ్చి ముత్యాల తమ్మి పూబళ్ళెరమున
తళుకు లఱమోడ్పు గొను జంటకలువ లమర;
జాఱు లతికల, విశద మంజరులతోడ,
చెలియ తోచె భోగార్చన సలిపినట్లు.

అద్దముల నారబోసిన యాణిముత్య
ముల విధాన చుక్కలు పలపల నెసంగె;
అల్లనల్లన జరుగు శ్వేతాంబరంబు
కలశములమీద చక్కగా కప్పు మబల !

చతుర పరకీయ నాయికా సాహచర్య
సుఖ ముపా దేయమగు; అన్యశోభనోప
వన సుమం బట్లు హృదయ సేవనకు మాత్ర,
మందరాక, ఆనగరాక, పొందరాక.

సహచరీ వయో విద్యుదంచల పయోధ
రముల నరసె సంమోహన భ్రమలు మున్ను
నేడు లక్షించె సుకవి వినిర్మల ప్ర
సూతికా స్తన్యధారాభినీత రుచులె.

34