ఈ పుట ఆమోదించబడ్డది
రమ్యాలోకము
“రమ్యచిత్రాళి గని, మధుర ప్రసన్న
సూక్తు లాలించి, ప్రాణి యౌత్సుక్యమందు ;
తదుపలాలనార్ద్రమగు చేతమ్మునందు
స్మరణ కెక్కు, జన్మాంతర సౌహృదములు."
హేయములు క్లీబములు జుగుప్సాయితములు
రమ్యములు గామి శిల్పదూరంబు లగును ;
జ్ఞాపన జ్ఞేయ విజ్ఞానశాలియయిన
సరున కెటుచాలు విషకృమి న్యాయవృత్తి ?
ధూమదూషిత దుర్గంధధామ వసతి
రాచిలుక మాలకాకియై నీచగిలును !
దుర్భయానక క్షుభ్యదధోగతి ప్ర
సక్తిమెయి భావనకు స్వవర్చస్సు తొలగు.
భ్రమరముఖ కబళితమైన పచ్చపురుగు
ప్రమదషట్పదియై గీతకములు పాడు,
ప్రియకలాప రమ్యాలోకమయిన కావ్య
రక్తహృదయ మానందధారణ రమించు.
33