పుట:రమ్యా లోకము.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము



యమున చూడని కొఱత గోరంతలేక
తీఱె నా కిప్డు మదిరాక్షి! తేటలారి
గంగయై, తామ్రపర్ణియై, కడకు కడలి
యై పొరలు నీ కటాక్ష శిక్షానుభూతి !

చద లలికి, అందముగ చిఱుసన్న రంగ
వల్లికలు తీర్చినట్లు రంజిల్లె తార ;
లంతరమున తోచె శశి సంక్రాంతినాడు
పాలు పొంగింవ పెట్టిన భాండమట్లు.

ప్రియు కటాక్షించు సతి యరవింద సదృశ
లోచనముల ఘూర్ణిలు రాగ వీచికలును
తనిసెడు ఆపత్య కామ సాంత్వనమునందె,
కొమ్మ కళుకులు ప్రసవమై కుదిరినట్లు.

“ప్రకృతియందు రమ్యము కాని వస్తుత తిని
చిత్రకళలు రమ్యముగ తీర్చెడిని"; కాన
హ్లాద రమణీయ కల్పనాపాదనమున
అపసరింత్రు మలిన జుగుప్సాదు లెపుడు.

32