పుట:రమ్యా లోకము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



10


ఉత్తరోత్తరోత్పతన సముత్సుకు లగు
కవుల కంఠము సూక్ష్మాంబర వివృతమగు ;
సహృదయాకాంక్ష కలిమి నా ఛాయలెల్ల
అల్ల నల్ల నున్ముక్తమై అభిరుచించు.

ఆకసమునందు తారల నడుగవలయు
భామ యంతఃకరణ రక్తభావములకు ;
పల్లవ స్నేహమున నెఱ్ఱబడిన నవ ర
సాలము లెఱుంగు ఆ జవరాలి గోడు.

పాలు పిదికెడు రాత్రి ముత్యాలు మునిగి
తేలి యాటలాడగ కాల గోళకమున;
బాంధవీ, నీ ప్రణయపక్వ పాయసమును
ఆత్మనైవేద్య మిడ నిది అదనుగాదె !

31