పుట:రమ్యా లోకము.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకముమట్టిలో బిడ్డ బీజము మంజుకుసుమ
బంధమై చెలువారు సంబంధ మరసి,
అతి మలీమసగర్భ సంపతిత బిందు
వద్భుతాకృతి గొను రహస్యములు పోల్చె.

కడుపునన్ గన్న సుతు సమక్షమున గూడ
పైట జాఱనీయని తల్లివరుస నరసి;
తీర్చే స్త్రీ పురుషుల ప్రేమ తీర్థసేవ
నౌచితీపారములుగ కావ్యమున సుకవి.

27