Jump to content

పుట:రమ్యా లోకము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


ద్యుమణి తన చిత్రరుచు లదృశ్యముగ విమల
పుష్పపత్ర ఫలాళిలో పోయురీతి;
సుకవి వాగర్ధబాంధవ స్ఫోటరక్తి
స్వరలతాంతములైన శబ్దముల నించు !

శుభవయోరాగ మంగల్య సుభగమయిన
కులవధూముఖవర్చస్సు కొలిచె నతడు;
శతదళోత్ఫుల్ల శోభా ప్రసాద సాధు
మాధురీ పూర్ణమయిన పద్మంబుతోడ.

ప్రొద్దు ప్రొద్దుల పూచు తమ్ముల మొగాల
దినకరుడు రావి రేకలు తీర్చెననియె;
పగ లెఱుంగని కన్నె కల్వలకు చంద
మామతోడ చీకటిచెల్మి మంతరించె.

“నీరు, తీసిపోయిన తటినీతటముల
పొరలుపడ్డ యిసుక మడపులను చూచి,
పానుపును వీడి లేచు భామానితంబ
గళిత సిత దుకూలాంచలముల స్మరించె.”

26