పుట:రమ్యా లోకము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8


సరసచైతన్య రంజిత జగతియందు,
కవి గ్రహింపగరాని వస్తువులు కలవె ?
రాళ్ళ నేడ్పించు పచ్చివిరహుల పగిది,
ఏళ్ళచే జోల పాడించు తల్లు లట్లు,

తీవెమీద సుతారంపు ఠీవి నిలిచి
పగలబడి నవ్వు పువ్వు పై కెగయు అళిని;
ప్రియుడు ప్రియురాలినట్లు చేర్చే నొక సుకవి
బిడ్డ తల్లిని భాతికల్పె మఱొకండు.

కూయు కోకిల రవళికన్ గుఱుతుపట్టి
పంచమశ్రుతి నరు డభ్యసించె నిజము;
సహజసిద్ధంబ యది పికజాతి కెల్ల
మహితయత్నసాధ్యం బాయె మానవునకు!

25