పుట:రమ్యా లోకము.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


శ్రవణ దారణములు, శిరీష ప్రసన్న
భావ బాధకములు, రసభంజకములు,
నైన విషమశబ్ద స్నేహ మనుఘటిల్ల,
దమృతమయమైన సుకవి సూక్తమున నెపుడు.

ప్రాతసొమ్ములు కరిగించి పసిడి తేర్చి,
క్రొత్త నగలను చేయించుకొనరె జనులు ;
సోమలతల రసంబు విశుద్ధమగును
గాక, చిన్ని పూదేనియల్ కటువు లగునె?