పుట:రమ్యా లోకము.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


చిన్ని నివ్వరి సిగవలె సన్నగా త-
ళుక్కుమన నాత్మకలజూచె నొక్క ద్రష్ట;
నవ్యతృణకంకణాభరణ ప్రయుక్తి
ప్రేమయోగ మొక్కండు భావించె నేడు.

కానబడ కనుమాన ప్రమాణమునకె
అంది యందని పరతత్త్వ మవలనుంచి;
పంచభూత భాసితమైన ప్రకృతి కళనె
సన్నిహిత లక్ష్యమనియె వచస్వి నేడు.

అందు నీ విలక్షణ జీవయాత్ర కొదవు
పృథివినే నవ్యులు సమాశ్రయింత్రు భక్తి,
తల్లిగా, ధాత్రిగా, దేవతామతల్లి
గా సమస్త పరాపర కామ్యములకు.