పుట:రమ్యా లోకము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3


కావ్యమును, గీతియును, చిత్రకళయు, నరున
కబ్బిన యుదాత్త దివ్యాంస లవనిమీద,
పశుదశావరణముల నావలకు దాట,
తన్మయానంద మంద సాధనలు కావె !

దారు లోహ శిలా కల్పితంబు లయిన
విగ్రహాదుల సౌందర్య విభవమందు
వివిధ లావణ్య తారుణ్య విభ్రమములు
హత్తక అపూర్తమగు శిల్పవృత్త సిద్ధి.

విన కనగలేని బధిరాంధజనుల కవని
సుస్వర ప్రతిమాదులు శూన్యములగు ;
ఏతదభివర్ణనాపూర్ణ కృతుల నెలమి
చదువగల డొక, డాలింపజాలు నొకడు.

8