పుట:రమ్యా లోకము.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


ఈ నిసర్గాంతరము చేతనే జగతిని,
కావ్య పద్య పాఠములకు కదల మెదల
నట్టి పనులు, వేణువు నూద నఱ్ఱులెత్తి
మెయి పులకరింప నాలించు మేతమాని.

రౌచికుండైన కవి రుచిర ప్రసన్న
పద మృదూపగూహన శయ్య బన్నగలడు
పద్యమందు గేయచ్ఛాయ ; బ్రౌఢమయిన
కృతికళ లసాధ్యమగు స్వరోద్గీతి యందు.

అనవరత తరంగప్రాయ మయిన స్వరము
గాయకుని కంఠధర్మవైఖరుల బట్టి
కటు మధుర భిన్నరుచుల వైకల్యమందు;
సాధుశబ్ద మీ వైషమ్య బాధ గనదు.

ఈ యతీవ సూక్ష్మంత రాన్వేషణమున
నాదగోళమున్ రెండు ఖండములు గాగ
చూచినాడ నంతియె ; ఉచ్చ నీచ నిశ్చ
యము సలుపగాదు గీతి కావ్యముల నడుమ.

8