ఈ పుట ఆమోదించబడ్డది
రమ్యాలోకము
ఆహతంబైన నాద మారోహణావ
రోహణల వాచ్యమై శ్రవ్యమై హృదంత
రాళమందు రాగోదయమై లయించు ;
సుస్వర శ్రుతిమేళన సుఖము నొసగి.
తనుతర స్వరములకు అర్థములు లేమి
కేవల రసోపచారక క్రీడ లగును ;
కాని, లోక సంగ్రహ చోదకములు కావు.
దేహ సంహిత లేని యింద్రియము లట్లు.
విహిత వాగర్థశోభన వివృతికలన
శబ్దకాండ మనంతమై శాఖసాగె ;
అప్రధానార్థమై స్వర వ్యాపనంబు
కేవ లాలాపనామాత్ర కేళికయ్యె.
స్వరమయంబైన గీతికిన్. శబ్దబద్ధ
మయిన కృతికి భేదము నైజమగుట గాదె.
శిశుపశూత్పవప్రదమయి చెలగె గీతి,
కావ్య ముచిత సంస్కృతులకే గ్రాహ్యమయ్యె.