ఈ పుట ఆమోదించబడ్డది
రమ్యాలోకము
నిర్వికల్పక విజ్ఞాన నిరతులయిన
బ్రహ్మవాదులకును, హ్లాదరాగహృదయ
వాదులైన కవులకును భేదమెంతు ;
తారతమ్య మీమాంసకు తగను నేను.
ధాతు నిష్పన్నరూప బద్ధంబ యగును
సంస్కృతంబు, ప్రవాహినీ సదృశయగును
దేశభాష ; ప్రమాణ నిర్దిష్ట మొకటి,
ఒకటి స్వస్థాన నాగర కోపయోగి.
అజ్ఝలంతము లయిన శబ్దాళికెల్ల
నైజమగు పూర్వరూపము నాదమగును;
తత్తరంగవదాహతధ్వని విశేష
ములనె కలిగె సర్వస్వరమ్ములకు జన్మ.
నామవాచ్యము గాక అనాహతంబు
సంచరిం చంతరింద్రియ స్థానములను ;
అనుభవింతురు తన్మయు లయిన ఘనులు
ఏతదానంద ధారా సమృద్ధ శాంతి.