ఈ పుట ఆమోదించబడ్డది
2
కాల ధర్మానుగతమై జగత్ప్రవృత్తి
మాఱునపుడు వాఙ్మయమును మాఱు నిజము,
క్రొత్తనీరు తొల్కరియేళ్ళ క్రుమ్మిపాఱ
ప్రాతనీరు కలంగుట టబ్రమ్ముకాదు.
ఋషులు శ్రుతిచేసి పాడిన ఋగనువాక
భాష నూని శాసింపడే పాణిని ముని ?
పిదప వార్తిక భాష్యముల్ వెలయవొక్కొ
ఉత్తరోత్తర సుప్రమాణోచితముగ ?
పరిషదభ్యస్త, మీశ్వర వాచనంబు,
శాస్త్రసాధన మయిన ఆ సంస్కృతంబు,
కవుల కుశలప్రయోగ గౌరవముకొలది
పరిణమింపదె మృదుకావ్యభాష గాగ ?
4