పుట:మ ధు క ల శ మ్.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్

                          67
వాడిన నాదుజీవమును పండినద్రాక్షరసానుభూతి గా
పాడుము, ప్రాణిలేని తనుబంధములన్ గడిగింపు; మావలన్
కాడలుసాగ దొప్పగిలు కమ్మనియాకుల జుట్టి యట్టులే
నీడలతోటపజ్జ శయనింపగజేయుము నన్ను నెచ్చెలీ !
                           68
పంటవలంతిగర్భమున పాతిన నాతనుధూళిగూడ ది
ఙ్మంటపముల్ సుడింబడ సుగంధరజం బెగబోయజూతు, వా
వెంటన బోవు విశ్వసనవేత్తలలోపల నొక్కడేని వా
ల్గంటి : తదియవాసనబలానకు ముగ్ధుడు కాకపోడుసూ,
                         69
ఇందనుకన్ వరించి భజియించిన జీవితసూత్ర లక్ష్యముల్
క్రిందువడంగ జేసెను సఖీ ; నను లోకులదృష్టి; ముంచితిన్
సుందరకీర్తిపాత్రమును శూన్యసరస్సున; అమ్మినాడ స్వ
చ్ఛందకళావిభూతియును ఛాందసమౌ నొకగీతికే తుదిన్.

59