పుట:మ ధు క ల శ మ్.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                    64

కల డంతఃకరణంబులేని ప్రభు వొక్కం డందు; రేతద్దృగం
చలవీథిన్ వచియింత్రు దుర్మరక హింసాధూమధామంబుగా
చెలి ! ఈజీవితమున్ పరీక్షయని వంచిం త్రంతె; ప్రేమార్ద్రు డా
తడు సౌఖ్యంబున బుట్టి సౌఖ్యమున సంతంబౌను సర్వం బిలన్.


                    65

పిమ్మట నూర్పు పుచ్చి యొకవృద్ధఘటం బనె నిట్టు “లస్మదం
గమ్ముల గంధ మెండె చిరకాలపువిస్మృతిచేత, నింపుమీ
క్రమ్మర నాపురాణరసకల్పముతో నను; మెల్ల మెల్లగా
సొమ్మలువాసి ప్రాణములు జోడయి శోభిలనోపు త్రోవరీ !"


                    66.

అటు లాయాఘటముల్ పరస్పరవివాదాసక్తిమై నుండ ఒ
క్కటి చూచెన్ నెలబాలు డంతయు సమాకర్ణించుచున్నట్టు; లం
తట నన్యోన్యము రాచుకొం చఱచె తంద్రన్, తమ్ముడా! వాహకుం
డిటు లేతెంచెడు కాయకాచినబుజా లేడాటలాడించుచున్.

57