పుట:మ ధు క ల శ మ్.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                     61

అంత మఱొక్క డిట్లనియె నక్కట ! ఈకరపాదజాతసం
క్రాంతికి నాడు మృత్పటలకల్పన మూరక చేసియుండ; డీ
వింతసురూప మిచ్చిన ప్రవీణుడె నన్ మఱలన్ తదాదివ
స్త్వంతరమందు జేర్పగ నుపాయముసైత మమర్చియుండెడిన్


                     62

అనవుడు బల్కె నింకొకతె యద్దిర! యెంతటిమచ్చరీడునున్
తన చవిదీఱ త్రావిన సుధాసుఖపాత్రిక చిట్లగొట్టునే ?
పవివడ జేసె నీఘట మెవం డతిశుద్ధపుబ్రేమ, నాత డా
కొనుక్రుధ నావలన్ పగులగొట్టెడునం టది యెంతచిత్రమో!


                      63

మునుకొని పల్క రెవ్వ; రొకమూరుత మాగి, వికారరూప మం
దినఘట మొక్క. డిట్లనియె దీనత “నందఱు నా కురూప వం
చనదశ కీసడింతురు విచారముమాని, విధాతహస్త మే
మినెపమునన్ వణంకి విషమించెను నన్ సవరించుపట్టునన్"