పుట:మ ధు క ల శ మ్.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                       55

ఈమధువల్లి నాటుకొనియెన్ సిగవిప్పుచు, దానికౌగిటన్
బ్రామెడు నామనో భ్రమరి; స్వామి శపించిననేమి? యాత డే
ధామముబైట తారసిలు దానికవాటము దీయు బీగమున్
మామకదేహలోహమును మార్చి ఘటించిన చాలు నెచ్చెలీ !


                      56

ఎఱుగుదు నింతమాత్రము చెలీ! విను; చిత్కళ నన్ను ప్రేమగో
పురమున కెత్తినన్ నెగలువోవు దురాగ్రహభుక్తి కిచ్చినన్
పరమమె; పానశాల గనబడ్డ కలాంశయొకండె కోవెలన్
సురిగి మసిన్ ముసుంగువడు జ్యోతులకంటె మహత్తరం బగున్.


                        57

నడిచెడి నాదు త్రోవకెలనన్ పలుగుంటలు మాయదారులున్
సుడివడునట్టు లేర్పఱచి, సూక్ష్మపురాకృతసూత్రబంధముల్
పొడవుగ నన్నిదిక్కులను బూనిచి; ఆవల దారి తప్పి చి
ట్టడరిన నీదు'పాప'మని యాడక యుందువుగాక దుర్విధీ!

51