పుట:మ ధు క ల శ మ్.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                     49

ఒకచదరంగపాళి యిది యుగ్మలి ! రంగులగళ్ళు రేల్బవల్ ;
సకలజగజ్జనంబులను సారెలుగా గొని కాలు డాడు; పొ
చికలును కొంతసే పనుగుచెల్మి నటించి, ఒకింతలోన మా
రకులయి ఈవలావల పరస్పరమున్ తెగి పేటికం బడున్.


                    50

బదులిడ, దౌను కాదనుచు ప్రశ్నలువేయదు. అటక డెటుల్
చదిమెడు నట్ల యేగు నపసవ్యమొ సవ్యమొ కందుకంబు; ఈ
చదరమునం దెవండు నిను జాగిల త్రోసెనొ యాత డొక్కడే
తదఖిలచాలనం బెఱుగు తన్వి ! యెఱుంగును సర్వమాతడే.


                   51

పరిపరి వ్రాయుహస్త మదీ వ్రాసిన నావల బోవు, నీ చమ
త్కరణముగాని ధర్మరతిగాని మరల్పగలేదు దానిలో
నఱసగమేనియుం దుడుప ! ఆ లిఖితంబున నొక్క ముక్కయున్
చెఱగదు నీదు బాష్పములు చెర్వయి వాగయి వెల్లివోయిసన్,

47