పుట:మ ధు క ల శ మ్.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                     46

బయలను లోన ప్రక్కలను పైనను క్రిందనుగూడ, చూడ నం
తయు నొకయింద్రజాల మగునాటక ; మాడుదు రొక్క వేదిపై
ప్రియముల కాగడాయగు రవిన్ వలగొంచును; నీడలట్టు లెం
తయు నటు వచ్చిపోదుము సుతారపు బొమ్మలవంతునన్ సఖీ !


                     47

ప్రాణి జగాన కెల్ల పరమావధియౌ అల శూన్యమందె యీ
శోణమరందమున్ తదభిచుంబనరక్తిమ గ్రక్కు మోవియున్
లీనము లౌనయేని ? గమనింపుము; కాగల కారణార్ధమో
మానదు, వర్తమానపరిమాణము నాగదుగాదె నెచ్చెలీ !


                   48

సొనకుదరిన్ గులాబి సొగసున్ మిగులన్ వికసించుచుండ, నె
ఱ్ఱనిమధుధార లానుచు కరంగుము ఖాయ్యముగూడి నీవు; న
ల్లనికలశంబుతో మరణలాసిక నిన్ దరియంగవచ్చెనే
ని నిలిచి జంకకుండ తరుణీ! కయికొ మ్మదియున్ ప్రియమ్ముగన్,

45