పుట:మ ధు క ల శ మ్.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                    43

పొరుపున నొండొరుల్ పడక పోరెడి 'డెబ్బదిరెండుశాఖలన్'
మఱలిచె నేకదిగ్గతికి మా ఱనకుండ నిమేషమాత్ర లో :
మెఱుగుపసిండిగా పరిణమింపగజేసెను లోకలోహ మ
బ్బురముగ నెచ్చెలీ ! తలపవో మధుమంత్ర మహారహస్యముల్.


                    44

ఆ బలవన్మహమ్మదు జయప్రభుశేఖరు మంత్రశస్త్ర ధా
రాబహుళప్రభల్ హృదయరాజ్యము ముట్టడివెట్టు నా స్తిక
క్లీ బవిచారకాండము ఖిలీభవమంద వెలుంగు చూడు, గా
రాబుచెలీ ! ప్రపంచమును ప్రామిన చీకటు లింక విచ్చెడిన్,


                      45

ఉరివడనిమ్ము పందితుల నుగ్రవివాదల: నిల్వనిమ్ము నా
శిరసుననే విచిత్రమగు సృష్టి విచారము నెల్లనో సఖీ !
పరిమళశయ్యపై ప్రణయభాగవతమ్ముల నాడుకొంచు నీ
మురిపెము సాగునన్నిదినముల్ సుఖియింపుము మోజు తీఱగన్.

43