పుట:మ ధు క ల శ మ్.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                        40
 
సహృదయులార ! యెన్ని దివసంబులనుండియొ సల్పుచుంటి నా
గృహమున క్రొత్తపెండ్లి సవరించు ప్రయత్నము, లెట్టకేల కీ
విహసితవీథినుండి వెలిపెట్టి పురాతనసూత్రపాలినిన్,
సహజమధుప్రియన్ ప్రణయశయ్యకు రమ్మని ఆమతించితిన్.


                        41

సూత్రపదప్రమాణములు చూపగజాలుదు అస్తి నాస్తి వా
ద త్రసరంబు త్రిప్పగ: పదంపడి లౌకికపారలౌకిక
క్షేత్రవిచారనిర్ణయము సేయగనోపుదు; కాని యీసురా
పాత్రమునందుదక్క కనుపట్టవు లోతు లికెందు సృష్టిలోన్.


                       42

కడ కొకసందెచీకటిని, కాంచనభాండము నంసభాగమం
దిడి మెలమెల్ల కాలిడియె నేకత మీమధుశాలవాకిటన్
పడతి యొకర్తె; ఆకనకభాండరసాయన మెంతొ ప్రేమ యే
ర్పడ రుచిచూడుమం చొసగె, త్రావితి నే మధువయ్యె నద్దియున్,

41