పుట:మ ధు క ల శ మ్.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                    37

వృథ కథ జెప్పనేల కృశియించునున్నది ఆయువంచు, నీ
మధుకలశమ్ము నింపుము సుమంగలి ! పుట్టని 'రేపు' కోసమై
శిథిలతగన్న 'నిన్న 'కయి చింతలవంతల మున్గనేటికో !
మధురములేని 'నేడు' లనుమానము మాని సుఖింపు మర్థిమై,


                    38

ఒకనిముసాన జీవకళ లుచ్చిన పాడుశ్మశానవాటి, నిం
కొకనిముసాన జీవితపయోనిధి పజ్జన : నిల్తు మద్దిరా !
సకి ! కనుమాసె తారకలు, సాగిరి యాత్రికులెల్ల. శూన్యరూ
పకమగు దిఙ్ముఖోదయముపై తమ లక్ష్యముపెట్టి వేగమే.


                    39

ప్రమదరొ ! 'నేతి నేత' యని పారము కానగరాని ఈవివా
దముల నలంగు దెందనుక? ధారలుధారలుగా స్రవించు తి
య్యముగల ద్రాక్షతో పరవశాదరయోగము మేలుకాదొ, శూ
న్యమొ అటుగాక చేదొ అగు అందనిపండులకంటె నెప్పుడున్,

39