పుట:మ ధు క ల శ మ్.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

Rubaiyat

మధుకలశమ్


                           34

ప్రణయివి : నే నంతరము భౌతికభాండము డాసి గుప్తజీ
వనతటినీతటం బెఱుగువాంఛను వావిడి వేడికొంటి, నే
మనియెనొ వింటివా “బ్రతికినన్ని దినంబులు త్రావవోయి తీ
యనిమధువున్ గతించియును ఆపల వచ్చుట మిథ్య సుమ్మిలన్"


                            35

కలగి యెలుంగు తొట్రు పడగా బదులాడిన యాఘట మ్మొక
ప్పుడు సుఖముండి వేడుకల బొంపిరివోవగ నోపునంచు నే
దలచెద నెచ్చెలీ! కలలు తగ్గిన తద్వదనమ్ముగూడ నిం
పొలయగ నిచ్చి పుచ్చుకొనెనో మును పెన్ని మిటారి ముద్దులన్ ,


                          36.

ఒక దివసప్రదోషమున ఓపికతో కనిపట్టినాడ శ
క్తి కొలది నార్ద్రమృణ్మధనకృత్యము సల్పెడు కుంభకారునిన్ :
సకియరొ ! సన్నగిల్లిన విషాదరుతిన్ బ్రతిమాలె నాఘటం
బకట ! 'కృపాపరుండవయి అన్నరొ ! మెత్తగ నొత్తు'మం చొగిన్.

37