పుట:మ ధు క ల శ మ్.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                    31

ఇల నడిబొడ్డునుండి వడి 'ఏడవవాకిట' బైటవచ్చితిన్
చెలగి 'శనైశ్చరుం' డధివసించెడుగద్దియ నెక్కతిన్, పథాం
చలమున బెక్కుముళ్ళు బిగి సళ్లగ విప్పితి; నైనగాని చి
క్కెడల దొకింత మృత్యువను ఈముడి మెల్కె లవెన్ని తీసినన్.


                  32

ఒకతలు పుండె ! దానిగడె లూడ్చెడుబీగము కానరాదు, వే
ఱొకతెర యుండె! ఆవెనుక సున్నది చూడగలేకపోతి, నిం
చుక వినినట్టులయ్యె నట సుంత'నినున్ నను'గూర్చి ముచ్చటల్
సకి ! యటుమీదటన్ మన ప్రశంస రవంతయు పల్క రెవ్వరున్ .


                   33

అంత తెగించి గోడివడు నాకసముం గని “చిమ్మచీకటిన్
సుంతయు దారి గన్పడక సోలుప్రజాలికి బాటసూస ఏ
కాంతులకాగడా కలదు కాలపుహస్తమునం" దటంచు"వి
భ్రాంతుడ ! అంధతుల్యమగు భక్తియె సు"మ్మని మాఱు వాకొనెన్ ,

35