పుట:మ ధు క ల శ మ్.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్

                      16
రేలుబవల్ కవాటములరెక్కలుగాగల ఈయెడారి స
త్రాలకు వచ్చుచుంద్రు సులతాను లొకం డెడలన్ మఱొక్క డాం
దోళిక లెక్కి: ప్రాభవముతో వసియింతురు రెండుమూడునా,
ళ్ళోలగ మాపి యంత నెటకో విరమింతురు, కంటె, నెచ్చెలీ !
                       17
‘జముషిదు' శీధు వానుచు యశస్సఖినేలిన నేలలందు సిం
హములు సివంగులున్ సలుపు న్యాయసభా క్రమ ఘండ్రు నేడు, 'బై
రము' మృగయామదాంధుని శిరం బెట వ్రాలెనొ అయ్యెడన్ యథే
చ్ఛముగను త్రొక్కు గార్దభము; దాన జలింపడు నిద్ర నాతడున్.
                      18
కడు నరుణమ్ముగా నెచట కన్నెగులాబి హసించు నచ్చటన్
పడదగు మున్ను ‘సీజరు' నృపాలుని రక్త మటంచు నెంతు, ఎ
క్కడ వికసించు దాసనలు గంపలు గంపలుగా వనాల న
క్కడ నొక అప్సరస్సఖి నిగారపువీడెము రాలియుండెడిన్ .

25