పుట:మ ధు క ల శ మ్.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్

                     7

మఱుగు వసంతవహ్నినడుమంబడ నీయనుతాప శీతచీ
వరమును బాఱవేసి మధుపాత్రను నింపగ రమ్ము నెచ్చెలీ 1
పఱచు వయశ్శకుంతరసవత్పథమో కడుకొంచె మున్న, దా
తురముగ విచ్చెడిన్ మెలపుతో తన కుచ్చుల రెక్క లల్లదే,

                     8

వేలకు వేలు పూజతలు వేకువతో వికసించు చూడుమీ,
రాలెడు నేలపాలగుచు రాగిణి ! యింకొక వేయిపూలు, రో
జాలను దెచ్చు నీశుభవసంతుడె యెత్తుకపోగలాడు ది
క్పాలసమానులౌ 'కయికొబాదును జంషిదు ' రాజరత్నమున్.

                     9

చెలి ! మన కేమి కావలయు శీఘ్రము రమ్మిటు లీవు ముక్తదుః
ఖులయిన 'కైకొబాదు కయిఖుస్రుల' గాథలు కట్టిపెట్టి ; మాం
సలరణరక్తి రుస్తుము భుజాలనె జొత్తిలుగాక, చల్దికై
కలగి “హతీముతాయి. పడుగాక వెతల్, వినబోకు మింతయున్.

19