పుట:మ ధు క ల శ మ్.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్




                    4
ముదిసినముచ్చటల్ మఱల మోసలువోయ ఉగాదికోర్కె కా
స్పదమగు నాత్మయున్ విజనవాటికకై విరమించు, నచ్చటన్
సదమలశాఖిశాఖల కనంబడు మోసెసు శ్వేతహస్త, మిం
పొదవగ భూమినుండి పయి కుబ్బెడి జీససు దై వికాంశయున్.


                   5
పాదులతో గులాబిసుమబంధము లెండె ఇరానుతోట, జ
మ్షీదునృపాలకుండును శమించె త్రికాలఘటీసమేతుడై ,
పై దలి ! నేటికెన్ మధువు పాఱెడు ద్రాక్షలు ప్రాతగిల్లినన్ ,
స్వాదుపయః ప్రవాహముల పజ్జను పూచెడు తోట లిప్పుడున్,


                   6
తమసంగీతము లాపి మౌనమున గంధర్వుల్ కడంబోయి రే
కముగా నెప్పుడొ ! కాని బుల్బులి సుధాకంఠంబుతో గూయు తీ
యము లూగన్ మధువో ! ప్రవాళమధువో ! యంచున్ గులాబీకపో
లములన్ పాండిమ విచ్చి క్రమ్మర జపాలావణ్య ముప్పొంగగన్,

17