పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

సాగింది. శ్రీరంగపట్నం ప్రజలను యధేచ్చగా దోచుకున్నాయి. టిపూ కుటుంబీకులతో సహా, సామాన్య ప్రజలను శారీరంగా, మానసికంగా హింసల పాల్జేసాయి. స్రీలు, వృద్ధులు,పిల్లలను బేదం లేకుండ బ్రిీటిషర్లు శ్రీరంగపట్నంవాసుల మీద అత్యాచారాలకు, అంతులేని దోపిడికి పాల్పడి, విలువైనది ప్రతీది దోచుకుని, తమను ముప్పు తిప్పలు ట్టి మట్టి కరిపించిన టిపూ సుల్తాన్‌ మీద భయంకరంగా కసి తీర్చుకున్నాయి. టిపూ సుల్తాన్‌ ప్రాసాదాన్ని పూర్తిగా దోచుకుని విధ్యంసం సాగించాయి.టిపూకు ప్రియమైన గ్రంథాలయాన్ని, ప్రబుత్వ రికార్డులను, టిపూ సుల్తాన్‌ శ్రీరంగపట్నాన్నిశ్మశానవాటికను చేసిగాని శతృ సైనికులు అక్కడ నుండి నిష్క్రమించలేదు. ఈ దోపిడిలో లభించిన అతి విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలతో పాటుగా గ్రంథాలు, ప్రభుత్వరికార్డులు, సనద్‌లు, టిపూ సుల్తాన్‌ కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక వస్తువులు అన్నీ కూడ శ్రీరంగపట్నంనుండి కలకత్తా చేరి అటు నుండి ఇంగ్లాండుకు తరలి వెళ్ళాయి. ఈ అకృత్యాలను, కర్ణాటక ప్రభుత్వం మాజీ మంత్రి, చరిత్రకారుడు జనాబ్‌ మహమ్మద్‌ మొయినుద్దీన్‌ రాసిన శ్రీరంగపట్నం అఫ్‌టర్‌ డాన్‌ అను ఆంగ్ల గ్రంథంలో సవివరంగా పేర్కొన్నారు.

శత్రువు చేత కూడ ఘనమైన నివాళులు, ప్రశంసలు అందాుకున్న టిపూ సుల్తాన్‌ లాింటి స్వదేశీ పాలకులు భారతదేశ చరిత్రలో అరుదు. ఆ కారణంగా చివరి నెత్తురు బొట్టు నేలరాలే వరకు బ్రిీటిషర్లతో పోరాడి, చివరకు రణరంగంలో కన్నుమూసిన, భారతదశం గర్వించదగిన ముద్దుబిడ్డడు టిపూ సుల్తాన్‌ చరిత్రపు టలలో అరుదెన శాశ్వత స్థానం పొందారు.

65