పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అప్పుడు టిపూ మరణాన్ని జనరల్‌ హారిస్‌ ధృవపర్చుకున్నాడు. అప్పిటికే టిపూ ధరించే ప్రత్యేక తలపాగా, బెల్టు, ఖడ్డం మాయమయ్యాయి.

టిపూ మృతదేహాన్నిస్వయంగా పరిశీలించి టిపూ మరణించారని నిర్ధారణ చేసుకున్నాక, ఆ సమయంలో కలిగిన ఆనందాన్ని పట్టలేక ఈ నాటి నుండి ఇండియా మనది ("Now India is ours") అని ఆంగ్లేయ సైనికాధికారి జనరల్‌ హరిస్‌ ప్రకటించాడు. టిపూ సుల్తాన్‌ సజీవంగా ఉన్నంతవరకు భారతదేశాన్నిపూర్తిగా తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు సాధ్యం కాదని,టిపూ ఉన్నంత వరకు తమ ఎత్తులు- కుయుక్తులు సాగవని గ్రహించిన బ్రిీటిషర్లు, టిపూ కన్నుమూసాక సంతోషం పట్టలేక పోయారు.

ఈ విజయం తరువాత ఓ ఆంగ్లేయాధికారి మాట్లాడుతూ, Defeat of Srirangapatnam would lay the Eastern empire under our feet అని వ్యాఖానించాడని ప్రముఖ చరిత్రకారుడు జి.యస్‌ సరశాయి తన History of Marathas లో ఉటంకించాడు. టిపూ మీద విజయం సాధించాక జరిగిన విందులో గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెల్లస్లీ మ్లాడుతూ "Friends today I am taking this glass of wine on the corpse of India..." అన్నాడు. ఆంగ్లేయాధికారి Thomas Minro మాట్లాడుతూ "We can eaily capture all of India but Tipu is the only hudrle." అన్నాడంటే టిపూ బ్రిీటిషర్ల దురాక్రమణను ఎంతగా ఎదుర్కొన్నాడో ఎంతగా అవరోధం అయ్యాడో, ఆంగ్లేయులను ముందుకు సాగనివ్వకుండ మరెంతగా నిలువరించాడో అవగతం అవుతుంది.

టిపూ ప్రజల మనస్సులలో ఎర్పరచు కున్న సుస్థిర స్థానాన్ని గమనించిన గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెలస్లీ బ్రిీటిష్‌ సైన్యాధికారులకు ఇచ్చిన విందులో మాట్లాడు తూ, మిత్రులారా మిమ్మల్నినన్నుఈ ప్రపంచం మర్చిపోవచ్చు. అయితే టిపూ స్మతులు మాత్రం కలకాలం నిలచిపోగలవు. (..."I fear my friends that Tipu's memor will live long after the world has ceased to remember you and me..") అని ఘనంగా నివాళులు అర్పించటం విశేషం.

టిపూ కన్నుమూసాడని నిర్థారించుకున్నాక బ్రిీటిష్‌ సైనిక కూటమికి పట్టపగ్గాలు లేకుండ పోయాయి. మైసూరు రాజ్య రాజధాని శ్రీరంగపట్నం మీద ఆంగ్లేయ కూటమికి చెందిన సైనిక బలగాలు విజృంభించాయి. ఈ విజృంభణ మూడు రోజుల పాటు

                                           64