పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

శ్రీరంగ పట్నానికి సమీపాన గల హైదర్‌ అలీ, టిపూ సుల్తాన్‌ సమాధి

సన్నిహితులు భావించ సాగారు. ఈ మేరకు పలు ఊహాగానాలు సాయం సమయం వరకు షికార్లు చేశాయి.

చివరకు చీకట్లు కమ్ముకుంటున్న వేళ బ్రిీటిష్‌ సైనిధికారి జనరల్‌ హరిస్‌, తన సాయుధ బలగాలను, టిపూ బంధువులు, సేవకులకు వెంటబెట్టుకొని మృత వీరుల గుట్టలలో టిపూ కోసం వెతు కులాట ప్రారంభించాడు. చివరకు విశ్వాసపాత్రులైన సెనికుల మృతదేహాల మధ్యన విగత జీవుడైన టిపూ కన్పించారు. అప్పటికీ ఇంకా అనుమానమే! టిపూ బ్రతికి ఉంటే, ఒక్కసారిగా లంఫిుస్తే అమ్మో! అనుకుంటూ భయం భయంగా కంపెనీ బలగాలు ఆయన బౌతిక్కాయాన్ని సమీపించేందుకు సాహసించలేకపోయాయి.టిపూబౌతిక కాయం చుట్టూ సాయుధు లైన సెనికులను నిల్చోపెట్టి ఏ కణాన్నైనా తుపాకులు


గర్జించేందుకు వీలుగా టిపూకు గురిపెట్టించి ఆయన దేహాన్ని సమీపంనుండి పరిశీలించి,

                                    62