పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

టిపూ తుపాకి గుండు కలిగించిన తీవ్రమెన గాయం వలన రగిలిన బాధను పళ్ళ బిగువున భరిస్తూన్నారు. అసమయంలో ఆంగ్లేయ కూటమికి చెందిన ఓ సైనికుడి చూపు టిపూ నేలకొరిగిన ప్రాంతంలో ఆయన ఖడ్గం, ఆయన ధరించిన విశిష్టమైన బెల్టు మీదపొదిగిన బంగారం, వజ్రాల మీద పడింది. అత్యంత విలువైన ఆ బంగారం, వజ్రాలను వశపర్చుకోవచ్చన్న ఆశ అతనిలో కలిగింది. నేలకొరిగియున్నఆ ఖడ్గధారి టిపూ అని అతనికి తెలియదు. ఆ విషయం తెలిసి ఉంటే ఆ మైసూరు పులి సమీపానికి కూడ ఎవ్వరూ రాగలిగేవారు కారు. టిపూ నిస్త్రాణంగా ఓ పక్కకు ఒరిగి ఉన్నారు. అవకాశం చిక్కింది కదా అని, అ సైనికుడు టిపూ బెల్టు, ఖడ్గాన్ని ఊడబెరుక్కోడానికి సాహసించి టిపూను సమీపించాడు. శత్రు సైనికుడు సమీపిస్తున్నాడని గమనించిన టిపూ తన శరీరంలోని బలాన్నంతా కూడదీసుకొని తన బెల్టు, ఖడ్గాన్ని తస్కరించ చూసిన శత్రు సైనికుడ్నితన కరవాలానికి ఎర చేసారు.

మృతుడనుకున్న వ్యక్తి అకస్మాత్తుగా కత్తి దూయటం, క్షణాలలో ఆ సైనికుడి ప్రాణాలు తోడెయ్యడంతో ఆ ప్రాంతంలోని సెనికులు ఖంగుతిన్నారు. అంతలోనే తేరుకుని టిపూ మీద తుపాకి పేల్చాడు.టిపూ సుల్తాన్‌ గాయపడి కూడ విక్రమించటం చూసిన మిగతా సెనికులు ఆయన మీద విచక్షణా రహితంగా తుపాకి గుండ్ల వర్షం కురిపించారు.ఆ గుండ్ల వర్షంలో పోరాట యోధుడు టిపూ సుల్తాన్‌, 1799 మే మాసం 4వ తేదీ సాయంసమయాన కన్నుమూసారు.

మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf

టిపూ సుల్తాన్‌ మృతిచెందిన స్థలంలో నిర్మించిన స్మారక స్థూపం

                 60