పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

వచ్చి ఆయనను తాకింది. ఆ మరుక్షణమే మరొకటి తుపాకి గుండు ఆయన శరీరంలోకి జొరబడింది. టిపూ అశ్వం కూడ తుపాకి గుండ్ల తాకిడితో కూలబడింది. టిపూ గుర్రం మీద నుండి క్రిందకు జారిపోయారు. ప్రపంచ ప్రసిద్దమైన ఆయన తలపాగా సుల్తాన్‌ శిరస్సు నుండి తొలగిపోయింది. ఆ అపత్కర పరిస్థితులలో గాయపడిన సుల్తాన్‌ను రక్షించుకునేందుకు కనీస సహాయం కూడ అందించలేని దుస్థితి.

టిపూ శరీరంలో జొరబడిన తుపాకి గుండ్లు కల్గిస్తున భయంకర బాధను భరిస్తూ కూడ లేచి నిల్చోడానికి శత విధాల ప్రయత్నించి ఆయన విఫలమయ్యారు. ఒక వైపు శరీరంలో రక్తమంతా భూమిని తడిపేస్తున్నా నీరసం ఆవహిస్తున్నా క్రమంగా ప్రాణం పోతున్నా,తన చేతిలోని ఖడ్గాన్ని మాత్రం ఆయన వదాలలేదు టిపూ తలపాగా ఊడి పోవటంతో, సామాన్య సైనికుల మృతదేహాల మధ్యన పడిఉన్న ఆయన ఎవరో కూడ గమనించలేని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆ సమయంలో యుద్ధ వాతావరణం కొంత తగ్గు ముఖం పట్టింది. టిపూ సైనికుల నుండి ప్రతిఘటన కరువైంది. శతృసైనికులు భారీ సంఖ్యలో కోటలోకి జొరబడ్డారు. ఆ సైనికులకు చర్యలకు అడ్డులేకపోయింది. అందినంత దోచుకోసాగారు. కోటలో ప్రజలకు రక్షణ కరువు కావటంలో విధ్యంసం, దోపిడి యధేచ్ఛగా సాగుతుంది.

టిపూ బౌతిక కాయం వద్ద రోదిస్తున్న ఆంతరంగికులు

                         59