పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అల్పాహారాన్ని పూర్తి చేయకుండనే లేచి వచ్చి పరిస్థితిని వీక్షించారు. స్వామిద్రోహులు చేసిన నమ్మకద్రోహం, శతృవుల కోటలోకి ప్రవేశం తదితర అంశాలను తక∆ణమే గ్రహించారు దుర్భేధ్యమైన కోటలోకి శతృసైన్యాలు భారీ సంఖ్యలో జొరబడిన విషయం గమనించారు. పరిస్థితులు చేతులు దాిటిపోయాయి.

ఆ సమయంలో టిపూ ఆంతరంగికులు ఆయనను కోట నుండి తప్పించు కోవాల్సిందిగా కోరారు. ఆ సలహా ఆయనకు రుచించలేదు. ఆంగ్లేయుల మీద, వారి వత్తాసుదారుల మీద, తిరుగులేని పోరాటం సాగించాల్సిందేనని నిర్ణయించుకున్నారు.విజయమో లేక వీరస్వర్గమో తప్ప మరొక ఆలోచన ఆయన మదిలోకి రాలేదు. ఆప్తులు,మంత్రులు, అధికారులు ఎంతగా వలదని వారిస్తున్నాఆయన వినలేదు.

చివరకు 'నక్క లాగా రెండు వందల సంవత్సరాలు బ్రతికే కంటే సింహంలా రెండు రోజులు బ్రతికిన చాలు' అని అంటూ టిపూ యుద్ధభూమిలోకి ప్రవేశించారు.ఈ సందర్భంగా, ' అమర్యాదాకర బానిస బ్రతుకు బ్రతికేకంటే శిరస్సుల మీద రక్తధారలను కురిపిస్తున్న యుద్ధామేఘాల క్రింద మరణించటం ఎంతో మేలు కదా భగవంతుడా!' అని ఆయన వ్యాఖ్యానిస్తూ శత్రు సైనికులలో చొరబడ్డారు. ( ' Better a lion's life for two days than a Jackal's life for two hundred years...Ya Allah, it is better to die beneth the coulds of battle raining blood upon our heads than to live of shame and degradation ' - BN Pande : Page. 15)

కంపెనీ సైన్యం వరదలా కోటలోకి చొచ్చుకువస్తూ, కోటలోని ప్రతి అంగుళాన్ని ఆక్రమించుకుంటున్నా, ఆ సైన్యాన్ని నిలువరించఫడానికి సరిపడ బలగాలు తనవెంట లేకపోయినా స్థిర నిశ్చయంతో ముందుకు సాగుతున్న టిపూ ఏమాత్రం అధైర్యపడలేదు.అధైర్యపడటం ఆయన జీవితంలోనే ఎరుగని ఆ యోధుడు ఒక్క అడుగు కూడ వెనక్కు వేయలేదు. శత్రువుతో సంకుల సమరానికి సిద్ధమై శతృసైన్యాల మధ్యకు ఆయన దూసుకుపోయారు. శతృ సెన్యాలు, ఆంగ్లేయాధికారులు కనీసం టిపూను సమీపించడానికి భయపడేంతగా రణభూమి అంతా తానై కన్పిస్తూ, శతృసైన్యాలలో భయోత్పాతం కల్గిస్తున్నారు. శతృసైన్యాలను చెండాడుతూ రణరంగంలో దూసుకుపోతున్న టిపూకు రక∆ణ కరువైంది. సన్నిహితులు-సహచరులు లేరు. అంగరక్షకులు లేరు. ఆత్మీయులు పలువురు రాజ్య రక్షణలో హతులయ్యారు.

అయినా కూడ ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో అమీతుమీ తేల్చుకోవడనికి సిద్ధామైన టిపూ శతృసైనికులను తునుమాడుతుండగా, తుపాకి గుండొకటి దూసుకు 58 31