పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిమైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

                    టిపూ జీవితంలో చివరి రోజు...

టిపూ సుల్తాన్‌ ఆయన తండ్రి హైదార్‌ అలీల చరిత్రను మొగల్‌ సామ్రాజ్యంలో సైనికాధికారిగా పనిచేసిన వ్యక్తి (Mr. M.M.D.L.T) రాసి, టిపూ కుమారుడు Prince Gholam Mohammed చే సవరింపడిన ప్రఖ్యాత గ్రంథం The History of Hyder Shah, alias Hyder Ali Khan Bahadur, and his son, Teppoo Sultan లో టిపూ యుద్ధ్దరంగంలో సాగించిన పోరాటాన్ని వివరించారు. ఆ వివరాలను Eminent Muslim Freedom Fighters పుస్తకంలో ఆ పుస్తక రచయిత G,Allana విస్తారంగా ఉటంకించారు.

1799 మే నాల్గవ తేది. ఆరోజున, అప్పటి వరకు కుట్రలు, కుయుక్తులు, ఎత్తులు, చిత్తులు, ఎత్తుగడలతో సాగుతున్న యుద్ధాన్ని అంతవరకు పర్యవేక్షించి, అప్పుడే అల్పాహారంస్వీకరించడానికి టిపూ తన ప్రాసాదానికి వచ్చారు. ఆయన కుటుంబీకులు అందించిన అల్పాహారం తినడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన ప్రాసాదానికి సమీపాన గల వాటర్‌ గేటు వద్ద సైనికుల కలకలం వినవచ్చింది. ఆ కలకలం విని

మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf

టిిపూ భౌతిక కాయాన్నిగుర్తించిన బ్రిటిష్‌ సైన్యాధికారి జనరల్‌ హారిస్‌ 57