పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

ల్సిందిగా అల్టిమేటం పంపాడు. ఈ చర్యతో టిపూ ఆగ్రహిస్తూ వెల్లస్లీ బెదిరింపులను బేఖాతర్‌ అన్నారు. ఆవకాశం కోసం ఎదురు చూస్తున్న అంగ్లేయులు మైసూరు రాజ్యాన్ని కబళించేందుకు సన్నాహాలను ముమ్మరం చేశారు.

1798 ఏప్రిల్‌ 26న అంగ్లేయాధికారి ఆర్థర్‌ వెల్లస్లీ (Arthur Wellesly) మద్రాసు చేరుకుnnaaడు. టిపూ మీద యుద్ధాన్ని ప్రకటించాడు. టిపూను ఎదుర్కోడానికి అందుబాటులో ఉన్నఉత్తమ సైనిక పటాలాలను అతి తక్కువ కాలంలో (the finest army in the shortest period) రప్పించుకున్నాడు. తాయిలాల ఆశ చూపి ఆదరించి బెదిరించి నిజాం నవాబును పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. పలు ప్రాంతాల మరాఠా ప్రభువులను మాలిమి చేసుకున్నాడు. భారీ ఎత్తున యుద్ధ సన్నాహాలను పూర్తి చేసుకుని ఆక్రమణకు ఉపక్రమించారు. టిపూ సుల్తాన్‌ రాజ్యం మీద అన్నివైపుల నుండి దాడులు జరపాలని కంపెనీ సైనికాధికారులకు, కంపెనీకి మద్దతునిస్తున్న స్వదేశీపాలకులు, పాలెగాళ్ళకు 1799 ఫిబ్రవరి 3వ తేదీన ఆదేశాలు జారీ చేశాడు.('..on 3rd February 1799, for the British arimes and those of the allies,immediately to invade the Sultan's dominions.' ) స్వంత బలగాలను సమకూర్చుకుని, టిపూను ఏకాకి చేసి స్వదేశీ పాలకులతో, మద్దతుదారులతో కలసి టిపూను పరాజితుడ్ని చేయడానికి పకడ్బందీగా పథాకాన్ని రూపొందించాడు.

ఈ మేరకు సమాచారాన్నిఅందుకున్న టిపూ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. శ్రీరంగపట్నం కోటను బలిష్టం చేశారు. సొంతగడ్డ రక్షణ కోసం ప్రాణాలిచ్చే సైనికులను సమకూర్చుకున్నారు. దురద్రుష్టకర పరిస్తితులకు లొంగిపోకుండ విదేశీ శతృవుకు, ఆ శక్తికి వత్తాసు పలుకుతన్న స్వదేశీపాలకులకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. చివరి పోరుకు టిపూ సిద్ధమయ్యారు. శ్రీరంగపట్నం మీదకు తరలి వస్తున్నశతృబలగాలను పరిమిత ఒనరులతో, బలగాలతో ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. 1779 ఏప్రిల్‌లో శ్రీరంగపట్నానికి 45 మైళ్ళ దాూరంలో గల సెడ్బీర్ (Sedaser) అను ప్రాంతంలో, మే 4వ తేదిన శ్రీరంగపట్నానికి 35 మైళ్ళ దూరంలో ఉన్న మావెల్లీ (Malvelly) అను ప్రాంతం వద్ద ఆంగ్లేయాధికారులు Stuvart మరియు General Haris లతో టిపూ తలపడ్డారు. ఈ రెండు ప్రాంతాలలో విజయం ఆంగ్లేయకూటమికి దక్కింది. 53