పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

టిపూ సజీవంగా ఉన్నంత కాలం రాజ్య విస్తరణకు ఆవకాశం ఉండదని కంపెనీ పాలకులు నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు నాల్గవ మైసూరు యుధం కోసం ఏర్పాట్లు ఆరంభించారు.

ఈ వాతావరణం గ్రహించిన టిపూ తన ప్రయత్నాలలో తానూ ఉన్నారు.స్వదేశీ పాలకుల మద్ధతు లభించకపోవటంతో, బ్రిీటిషర్లను వ్యతిరేకించే బయిటి శక్తుల సహాయం కోసం ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన కాబూల్‌, కానిస్టాన్ట్‌నోపల్‌,అరేబియా, మారిషస్‌ తదితర రాజ్యాధినేతలకు కూడ లేఖలు రాశారు. బ్రిీటిషర్లను పాలద్రోలేందుకు సహకరించాల్సిందిగా కోరుతూ దౌత్యఅధికారులను పంపారు. టిపూ తండ్రి హైదరాలి హయాం నుండి మైసూరు రాజ్యానికి చిరకాల మిత్రులైన ఫ్రెంచ్‌ వారి సహాయాన్ని ఆయన కోరారు. ఆనాడు ఇంగ్లీషు వారికి, ఫ్రెంచ్‌ వారికి మధ్యనున్న విభేదాల వలన టిపూకు సహకరించేందుకు ప్రెంచ్‌ అధికారులు అంగీకరించారు. 1798 ఏప్రిల్‌ మాసంలో కొందారు ఫ్రెంచ్‌ అధికారులు మాంగళారుకు చేరుకున్నారు. టిపూ మైసూరు రాజ్య రక్షణకు సాగిస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకున్న బ్రిీటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వెల్లస్లీ (Governor General Marquis Wellesly) మండిపడ్డాడు. పశ్చిమ తీరాన ఉన్న టిపూ బలగాలను తొలగించాల్సిందిగాను, రెండు కోట్ల పూచికత్తును చెల్లించి, మైసూరు రాజ దార్బారులో తమ ప్రతినిధిని అనుమతించా

ఇన్‌సెట్ లో యుద్ధభూమిలో బ్టిరిీషర్లతో పోరాడుతున్న మైసూరు పులి

మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf

52 28