పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

వలసపాలకులకు తొత్తులుగా మారిన స్వదేశీ పాలకులు సంధి షరతులను నిర్దేశించారు.సంధి షరతులు కఠినంగా ఉన్నాకూడ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టిపూ సంధికి అంగీకరించారు.

ఈ మేరకు శ్రీరంగపట్నం సంధి 1792 మార్చిలో కుదిరింది. ఈ సంధి ప్రకారంగా టిపూ తన రాజ్యంలోని సగం ప్రాంతాలను ఆంగ్లేయ కూటమికి అప్పగించాల్సి వచ్చింది. ఈ ప్రాంతాలను నిజాం, మరాఠా పాలకులు, ఈస్ట్‌ ఇండియా కంపెనీ పంచుకున్నారు.రాజ్యభాగాన్ని శతృకూటమికి సమర్పించటం మాత్రమే కాకుండ ముఫ్పై లక్షల పౌడ్ల నష్ట పరిహారం కూడ టిపూ చెల్లించాల్సి వచ్చింది.

(He has to pay a war Indeminty of 3 1/2 Croes of rupees, - Brief History of Andhra Pradesh, Ed. by Mohd. Abdul Waheed Khan, Govt. of AP, Hyderabd, 1972, Page 91)

ఈ భారీ మొత్తాన్ని పూర్తిగా చెల్లించే వరకు శత్రుకూటమి టిపూ బిడ్డలిరువుర్ని తమ వద్ద ఉంచాలని షరతు విధించింది. ఈ షరతు మేరకు తప్పనిసరి పరిస్థితులలో టిపూ తన బిడ్డలను ఆంగ్లేయాధికారుల వద్ద పూచీకత్తుగా ఉంచారు. సంధి షరతుల మేరకు మూడున్నర కోట్ల రూపాయలను ఆంగ్లేయులకు చెల్లించిన తరువాత గాని టిపూ తన బిడ్డలను బ్రిీటిషర్ల పంచ నుండి విముక్తం చేయలేకపోయారు. మాతృభూమిని విదేశీ శక్తుల నుండి విముక్తం చేయాలని అహర్నిశలు పోరాడుతున్న టిపూకు స్వదేశీ పాలకుల సహకారం లభించక పోవటేమే కాకుండ పరాయి పాలకుల, ఆ పాలకుల వత్తాసు దారుల పట్ల శత్రుత్వం వహించినందున తన బిడ్డలను కూడ పూచీకత్తు ఉంచాల్సిన పరిస్థితి రావటం విచారకరం.

ఈ యుద్ధ పరిణామాలు టిపూ మనస్సును తీవ్రంగా కలచివేశాయి. ఈ యుద్ధంలో బ్రిీటిషర్లకు విజయం లభించటంతో, భారత దేశంలో కంపెనీ పాలన నిలదొక్కుకోడానికి కారణమైంది. స్వదేశీ పాలకుల స్వాతంత్య్ర పరిరక్ష్నణపోరాట చరిత్రలో మూడవ మైసూరు యుద్ధ దురదృష్టకర సంఘటనగా నిలిచిపోయింది.

నిర్ణయాత్మక నాల్గవ మైసూరు యుద్ధం (1799) మూడవ మైసూరు యుద్ధ పరిణామాల మూలంగా టిపూ దెబ్బతిన్న పులిలా ఉన్నాడు కనుక, ఆయన నుండి ఎప్పుడైనా పెనుప్రమాదం పొంచి ఉందని భయపడిన విదేశీ పాలకులు, ఆ పాలకులకు మద్దతు పలుకుతున్న స్వదేశీ పాలకులు, పాలెగాళ్ళు దెబ్బతిని ఉన్న మెసూరు పులి టిపూను ఎలాగైన అంతం చేయాలని నిరయించుకున్నారు.

                          51

్ణ 51