పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


            మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

చరిత్రకారుడు పేర్కొన్నాడు.(He hated the English and had openly vowedthat he would someday drive them out of India - History of India By E.Marsden, Macmillan, London, 1944 Page157).ఈయుద్ధంలో టిపూ Brigadiar Mathews ను 1783లో బంధించారు. ప్రథమ మైసూరు యుద్ధంలోలా రెండవ మైసూరు యుద్ధంలో కూడ చేదుా అనుభవాలను చవిచూసిన కంపెనీ అధికారులు టిపూతో సంధిచేసుకున్నారు. 1784 మార్చి మాసంలో ఇరుపక్షాల మధ్య మంగళారు సంధి (Treaty of Mangalore) కుదిరింది.

ఈ రెండు యుద్ధాలు మైసూరు పాలకులకు అనుకూలంగా సాగగా, కంపెనీ అధికారుల మెడలు వంచి తమ షరతులకు అనుగుణంగా ఒడంబడికలు రూపొందించి అధిపత్యం చాటుకుని టిపూ సుల్తాన్‌ తమది పై చేయిగా నిరూపించుకున్నారు.

      మూడవ మైసూరు యుద్ధం (1790-92)

తిరువాన్కూరు సంస్థానాధీశునితో టిపూకు వచ్చిన వివాదాం సాకుగా, ఒప్పం దాన్ని ఉల్లంఫిుంచి ఆంగ్లేయులు టిపూను రెచ్చగొట్టిన కారణంగా మూడవ మైసూరు యుద్ధం 1790 మే మాసంలో ఆరంభమైంది. (Lord Coronwallis forced Teepu by violating the treaty " to Produce war with that Prince " - History of Freedom Movement in India, Vol. 2, Tara Chand, Govt. Of India Publications, New Delhi 1992, Page. 226)

ఈ యుద్ధం రెండు సంవత్సరాలు సాగింది. ఆంగ్లేయాధికారి Major General Medows నేతృలో ఆరంభవుౖ ఈ యుద్ధం తొలి దాశలో టిపూ విజయ పరంపర సాగింది. పరాజితుడైన Major General Medows ఓ దశలో పరాభవాన్నిభరించలేక ఆత్మహత్యకు ఉపక్రమించాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ నిదులు కూడ చాలా కరిగిపోయాయి. ఈ దశలో యుధ రంగాన టిపూ అద్భుత నైపుణ్యం మరియు ఎత్తుగడలను అనుసరించారని, అందుకు దీటుగా తన అధికారులు వ్యవహరించలేక పోయారని భావించిన లార్డ్‌ కారన్‌వాలిస్‌ (Lord Caranwallis)స్వయంగా యుద్ధరంగప్రవేశం చేశాడు. 1791 జనవరిలో అతను బ్రిీటిష్‌ సైనిక కూటమి నాయకత్వబాధ్యాతలను చేపట్టాడు.

టిపూ వ్యతిరేక శక్తులకు ఆశలు చూపెట్టి, భయం కల్గించి టిపూకు దూరం చేయటమేకాకుండ లార్డ్‌ కారన్‌వాలిస్‌ తనకు అనుకూలం చేసుకున్నాడు. ఈ వాతావరణంలో మరింత ఉత్సాహంతో టిపూను పరాజితుడ్ని చేయ సంకల్పించిన స్వదేశీ 49