పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ప్రకారంగా మైసూరు రాజ్యం మీద ఎవరైనా దాడులు జరిపితే కంపెనీ సేనలు మైసూరు రాజ్య సైన్యాలకు అండదండలు ఇచ్చేందుకు అంగీకరించాయి. ఈ సంధితో ప్రథమ మైసూరు యుద్ధం మైసూరు రాజ్యం పక్షాన విజయవంతంగా ముగిసింది.

                  రెండవ మైసూరు యుద్ధాం (1780-84)

1771లో మైసూరు రాజ్యం మీద మరాఠాలు దాడులు ప్రారంభించారు. ఆ దాడులను ఎదుర్కొంటున్న హైదార్‌ అలీకి మద్రాసు సంధి ఒడంబడిక ప్రకారం కంపెనీ సేనలు మైసూరు సేనలకు అండగా నిలవాలి. అందుకు భిన్నంగా కంపెనీ సేనలు మరాఠాల పక్షం వహిస్తూ ఒడంబడికకు భిన్నంగా ప్రవర్తించాయి. ఆ తరువాత మైసూరు రాజ్య పరిథిలో గల ఫ్రెంచి వారి స్థావరం మాహే ను ఆంగ్లసేనలు ఆక్రమించాయి. ఈ ఉల్లంఘన సహించని హైదార్‌ అలీ 1780 లై మాసంలో యుద్ధం ప్రకటించారు. ఈయుద్ధంలో తండ్రి హైదర్‌ అలీతో కలసి టిపూ ప్రదాన పాత్ర పోషించారు. ఈ సందర్బంగా ఆంగ్లేయాధికారులు Col.Ballie, Sir Eyre Coote, Col.Briath మైసూరు రాజ్యాధినేతల చేతుల్లో పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. టిపూ ఆయన తండ్రి హైదర్‌ అలీల నేతృ త్వంలో క్రమంగా విస్తరిసూ,్ బలోపేతం అవుతున్న మైసూరు రాజ్య ప్రగతిని బూచిగా

చూపి నిజాం, బేరూరు రాజు, మాధావజీ సింధియాలతో హైదార్‌ అలీ ఏర్పాటు చేసిన స్వదేశీ పాలకుల కూటమిని కుిటిల నీతితో ఆంగ్లేయులు విచ్ఛినం చేశారు.

స్వదేశీ పాలకుల కూటమి విచ్ఛిన్నమైనప్పటికి, స్వదేశీ పాలకులు పరాయి వాళ్ళ పంచనచేరి శతృ త్వం ప్రకటించినప్పటికి హెదర్‌ అలీ, టిపూ సుల్తానలు పరాక్రమిస్తూ ఆంగ్లేయులను పరాజితులను చేయసాగారు. రెండవ మైసూరు యుద్ధం కీలక దశలో ఉండగా 1782 డిసెంబరు 7వ తేదీన హైదార్‌ అలీ యుద్ధ రంగంలో మరణించారు.

ఈ వార్త టిపూకి అందే సరికి ఆయన మలబారు తీరాన కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ను తరిమి కొడుతున్నారు. తండ్రి కన్నుమూసిన వార్త విన్న టిపూ సత్వరమే శ్రీరంగపట్నం చేరుకుని, 1782 డిసెంబర్‌ మాసంలో మైసూరు రాజ్యలక్ష్మిని చేబ్టిన టిపూ, మైసూర్‌ సుల్తాన్‌ అయ్యారు.

తండ్రి హెదార్‌ అలీ అడుగుజాడలలో టిపూ కూడ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ముందుకు సాగారు. స్వదేశీ గడ్డ మీద విదేశీయుల పొడ కూడ సహించని టిపూ బ్రిీటిష్ శక్తులను తరిమికొట్టేందుకు ప్రతిన పూనాడని .E.Marsden అను ఆంగ్లేయ 48