పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

దక్షి∆ణ భారత దేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ప్రధాన కేంద్రామైన మద్రాసుకు 5 మైళ్ళ దూరం వరకు మైసూరు రాజ్య సేనలు వచ్చి చేరాయి. ఈ వ్యతిరేక పరిణామాలతో హడలెత్తిన ఆంగ్ల సేనలు, ఆంగ్లేయాధికారులు కకావికలయ్యారు.

ఈ యుద్ధంలో, 1763 నాటి బక్సర్‌ యుద్ధంలో మీర్‌ ఖాశిం, షా ఆలం, షుజావుద్దౌలా లాింటి స్వదేశీ పాలకుల సంయుక్త సేనల కూటమిని పరాజితులను చేసివిజేతగా కిరీటం ధరించిన ఆంగ్లేయాధికారి Sir Hector Munro హైదార్‌ అలీ, టిపూలపరాక్రమానికి విస్తుపోతూ బ్రతికుంటే బలుసాకు తిని జీవించవచ్చని కంజీవరంలోని చెరువులో ఆయుధాలను పారేసి బ్రతుకు జీవుడా అంటూ పారిపోయాడు. (TIPU SULTAN : HIS VISION AND MISSION, By Prof. B. Sheik Ali, Published in Radiance Views Weekly 1-7 August 1999, Page. 15)

ఈ పరిణామాల మూలంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రతిష్ట దిగజారి, కంపెనీ షేర్ల ధర 275 నుండి 222కు పడపోయింది.( Eminent Muslim Freedom Fighers,G.Allana, Page 58) ఇండియాలోని ప లు ప్రాంతాలను ఆక్ర మించుకుంటూ అపరిమితమైన సంపదను పోగేసుకుంటున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీకి మద్రాసులో హైదార్‌ అలీ కల్పించిన పరాజయం అశనిపాతమైంది. ఈ పరాజయం లండన్‌ స్టాక్‌ మార్కెట్టులో సంక్షోభానికి కారణం కావటమే కాకుండ, మీరు ఊహించనలవి కాని కష్లాను తెచ్చిపెట్టారు. నాటి నుండి బయటపడటం ఎలాగో అర్థం కావటం లేదు అని కంపెనీCourt of Directors వాపోయారు. (" ..You have brought us into such a labyrinth of difficulties, that we do not see how we shall be extricated from them.",) మిమ్మల్ని వ్యాపారం కోసం పంపాం. హిందూస్థాన్‌లోని రాజ్యాల వ్యవహారాలలో పాల్గొనేందుకు కాదు, ( ...it is not for the Company to take the part of umpries of Indostan..) అని కంపెనీ అధికారులను హెచ్చరించారు. ఈమేరకు ఇంగ్లాండు నుండి కంపెనీ పాలకుల నుండి భారతదేశంలోని ఆ కంపెనీ అధికారులకు తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయంటే ఇంగ్లాండు గుండెల్లో టిపూ,హైదార్‌ అలీ ఎంతటి భయోత్పాతం కలిగించారో అర్థం చేసుకోవచ్చు. (An Advanced History of India, by RC Majumdar and others, Macmillan, 1996 Page 675) ఈ విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆంగ్లేయులు మైసూరు రాజ్యాధి నేతల పరాక్రమానికి తలవొగ్గి 1769లో మద్రాసు సంధి చేసుకున్నారు. ఈ సంధి 47