పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ army was one of the best in the world) ప్రశంసించాడు. ఆఘమేఘాల మీదతరలి వచ్చే టిపూ అశ్వికదళం శక్తి సామర్థ్యాలు ఆంగ్లేయులను ఆశ్శర్యచకతుల్ని చేశాయి.శతృ సైన్యాల మీద మెరుపుదాడులు సాగించే అశ్వికుల ప్రావీణ్యాన్ని బహువిధాల ప్రశంసించారు. ఈ విషయమై ఆంగ్లేయాధికారి Alexander Dow ప్రస్తావిస్తూ, టిపూసుల్తాన్‌ అశ్విక దాళాలు కోట గోడలను కూడ అత్యంత సునాయాసంగా దాటటం చూస్తుంటే ఆయన అశ్వాలు రెక్కలు కలిగియున్నాయన్న భయం కలుగుతుందని ('.. we are alramed as if his horses had wings to fly over our walls..') అనిఅన్నాడు.

ఈ మేరకు టిపూ మిత్రులు మాత్రమే కాకుండ ఆయనతో నువ్వా ? నేనా ? అని తలపడిన ఆంగ్లేయాధికారులు, ఆయన అంటే గిట్టని పలువురు చరిత్రకారులుకూడ టిపూ శక్తి సామర్థ్యాలను కొనియాడక తప్పని పరిస్థితిని చూస్తే, యుద్ధతంత్ర నిపుణుడిగా టిపూ ఎంత శక్తివంతుడో అవగతమవుతుంది.

               మలుపులు తిప్పిన మైసూరు యుద్ధాలు

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో, స్వార్థపరులైన స్వదేశీ పాలకులతో పలు పోరాటాలు చేసినా, బ్రిీటిష్‌ సైనిక కూటమితో టిపూ తండ్రి హైదర్‌, టిపూ చేసిన ప్రదాన పోరాలు మైసూరు యుద్ధాలు గా చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.ఈ యుద్ధాలలో మొదటి రెండుయుద్ధాలు టిపూ, హైదార్‌ అలీ కలసి చేయగా, చివరి రెండు టిపూ సాగించినవి. ఈ చారిత్రిక యుద్ధాలలో మెదటి రెండు యుద్ధాలు టిపూకు అనుకూలంగా పరిణమించగా, చివరి రెండు ప్రతికూలమయ్యాయి. టిపూ సుల్తాన్‌కు ప్రతికూలంగా సాగిన ఈ రెండు యుద్ధాలు మాత్రం భారతదేశం క్రమంగా బ్రిీటిషర్ల పెత్తనంలోకి జారీ పోడానికి బాటలు వేశాయి. ఈ పోరాటాలు టిపూ పాలిట శాపాలుగా మారటంతో బ్రిీటిషర్లు ఈ గడ్డ మీద స్థిరపడి, తమ పట్టును బిగించగలిగారు.

                   ప్రథమ మైసూరు యుద్ధ్దం (176-69)

ప్రథమ మైసూరు యుద్ధాంలో హైదర్‌ అలీ మార్గదర్శకత్వంలో బ్రిీటిషర్ల, వలస పాలకులకు మద్దతు పలికినస్వదేశీ శక్తులు నిజాం, మరాలకు బుద్ధి చెప్పేందుకు సాగించారు. ఈ పోరాటంలో టిపూ నేతృత్వంలోని సేనలు అప్రతిహతంగా ముందుకుసాగాయి. ఆ సమయంలో టిపూ వయస్సు 17 సంవత్సరాలు. 1769 మార్చి మాసంలో 46