పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

బదులుగా విధించిన జరిమానా సొమ్ము మొత్తాన్నిబట్టి, గ్రామ పొలిమేరల్లో మొక్కలను నాటాలని, ఆ మొక్కలకు సక్రమంగా నీళ్ళు పోస్తూ, బాగా పెరిగేంత వరకు సంరక్షణ బాధ్యతలను నేరస్థుడు నిర్వహించాలని 1792లో ఆయన శాసనం చేసారు. ఈ బాధ్యా తలను సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో పర్య వేక్షించడానికి గ్రామాధికారులను నియమించారు. ఈ వినూత్న శాసనం, ఆ శాసనం అమలుకు ఆయన తీసుకున్న నిర్ధుష్ట చర్యల వలన ప్రజలు నష్టపోయేది ఏమీ లేక పోగా మైసూరు రాజ్యం హరితవనంగా మారింది. ఈ వినూత్నశిక్షణావిధానం వలన, మైసూరు రాజ్యంలో హరిత విప్లవం విలసిల్లిందని టిపూకు వ్యతిరేకంగా తృతీయ మైసూరు యుద్ధంలో పాల్గొన్న బ్రిటిష్‌ సైన్యాధికారి Edward Moore ప్రత్యేకంగా పేర్కొనటం గమనార్హం

                     రాకెట్టు టెక్నాలజీకి ఆధ్యుడు

ప్రజా జీవితాలను ప్రభావితం చేయగల అన్ని వ్యవస్థల అభివృద్ధికి టిపూ అమిత శ్రద్దచూపారు. ప్రపంచంలో ప్రతి పరిణామాన్నిఆయన ఆకళింపు చేసుకుంటూ, ఆయా మార్పులు-చేర్పులను తన రాజ్యంలోని ప్రజల మేలు కోసం వర్తింపచయ ప్రయ త్నించారు.ఈ మేరకు భారత దేశంలో రాకెట్ టెక్నాలజీని ఆభివృద్ధి పర్చి ఉపయాగించిన ప్రబువుగా టిపూ ప్రత్యే కతను గడంచారు. ఆంగ్లేయులతో సాగిన యుద్ధాలలో ఆయన యుద్ధ రాకెట్లను బాగా ఉపయోగించారు. ఈ యుద్ధ రాకెట్ల తయారికి స్వదేశీ పరిజ్ఞానానికి విదేశీ సాంకేతిక విలువలను జోడించి వినూత్న యుద్ధ రాకెట్లను ఆయన ఆవిష్కరింపచేశారు.ఈ కారణంగా ఆయన యుద్ధ రాకెట్ల ఆధ్యుడుగా ఖ్యాతిగడించారు. (Tipu Sulthan was the pioneer of the missile Technology in India. - The Milli Gazette,16-31, Jan. 2006 page. 9)

ఈ యుద్ధ రాకెట్టును భారతీయ యుద్ధ రాకెట్టు (India's War Rocket) గా పరిగణించారు. ఈ రాకెట్టు 2.4 కిలోమీటర్ల dooరంలో గల లక్ష్యానికి ఛేదించగలిగేది.ఈ రాకెట్ల తయారి, వినియోగం కోసం ఆయన ప్రత్యేకంగా 1200 నుండి 5 వేల మంది గల రాకెట్టు దళం ఏర్పాటు చేశారు. ఈ విషయాలను Prof. R.Narasimha తన వ్యాసం Tipus Contribution to Rocket Technology లో వివరించారు. టిపూ ఆవిష్కరించిన ఈ యుద్ధ రాకెట్ల విషయాన్ని మన రాష్ట్రపతి అబుల్‌ కలాం కూడ ప్రస్తావిస్తూ, ప్రపంచంలోని ప్రపథమ యుద్ధ రాకెట్టును టిపూ ఎలా వాడగలిగారు ? (How 42