పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


             సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

పేర్కొన్నారు. ఈ పుస్తకం ఆనాటి బెంగాల్‌, అస్సాం, ఉత్తర పదేశ్‌, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, రాష్ట్రాలలోని ఉన్నత పాఠశాల విద్యార్థుల చరిత్ర పాఠ్య గ్రంథంగా చాలా కాలం చెలామణీ అయ్యింది.

ఈ విషయం చాలకాలం తర్వాత ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు, ఆ తరువాతి కాలంలో పార్లమెంటు సభ్యులు, రాజస్థాన్‌ గవర్నర్‌గా పనిచేసిన డా|| బి.యన్‌. పాండే దృష్టికి (1928-29) వచ్చింది. ఆయన Religious of Tipu Sultan అను విషయం మీద ఆనాడు పరిశోధన చేసుnnaaరు. టిపూ లౌకిక ప్రబువుగా నిరూపించే పలు దాష్టాంతాలు, ఫర్మానాలు, మఠాలకు, మఠాధికారులకు, జగద్గురువులకు,పీఠాధిపతులకు రాసిన వందలాది లేఖలను అధ్యయనం చేసిన ఆయనకు ఈ విషయం ఆశ్చర్యకరం అన్పించింది. మతాలు, మత విశ్వాసాలు, మతస్తుల పట్ల సమాన గౌరవాన్ని ప్రదర్శించిన టిపూ మీద వచ్చిన ఇటువింటి ఆరోపణలను శ్రీ పాండే నమ్మలేక పోయారు.

ఈ విషయం గురించి వాస్తవం తెలుసుకోవాలని ఆయనలో ఉత్సుకత కలిగింది. ఆ సమాచారానికి ఆధారాలేవో తెలుపమని, డా|| హర ప్రసాద్‌ శాస్త్రికి పలు లేఖ రాసారు. శ్రీ శాస్త్రి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. శ్రీ పాండే పట్టువదలని విక్రమార్కునిలా ఉత్తరాలు రాయసాగారు. చివరకు తన లేఖకు సమాధానం రాకున్నట్లయితే, డా|| హర ప్రసాద్‌ శాస్త్రి ఆరోపణలు, ఆ తదుపరి చర్య లను మేధోపరమై న వంచనగా పరిగణంచాల్సి వస్తుందని శ్రీ శాస్రిని ఆయన హెచ్చరించారు. ఆ హెచ్చరికతో,ఆ సంఘటన వివరాలు మైసూరు గెజిట్లో ఉన్నాయంటూ, ఒక్క చిన్నమాట రాసిన లేఖను పంపి డా|| శాస్త్రి సరిపెట్టదలచుకున్నారు.

డాకర్‌ శాస్త్రి పంపిన ఆ వివరాల మేరకు, శ్రీ బి.యన్‌. పాండే మైసూరు గెజిట్ లో ఈ సంఘటన కోసం అంవేషించారు. ఈ విషయమై, మైసూరు చరిత్ర మీద నిష్ణాతులైన ప్రోఫెసర్‌ శ్రీకాంతయ్య, శ్రీ బ్రిజేంద్రానాధ్‌ సీల్‌లను ఆయన సంప్రదించారు. మైసూరు రాజ్య చరిత్ర మీద మంచి పరిజ్ఞానం కలిగిన ప్రముఖ చరిత్రకారుడు శ్రీ కాంతయ్య ఈవిషయమై శ్రీ పాండేకు లేఖ రాస్తూ, మైసూరు రాజ్యచరిత్ర అధ్యయనశీలిగా మూడు వేల మంది బ్రాహ్మణుల ఆత్మహత్య సంఘ టన తన దృష్టికి రాలేదని, అటువంటి సంఘటన మైసూరు గజిట్లో ఎక్కడ తాను చూడలేదని, అది ఎక్కడలేదాన్ని తాను ఘంటా పధంగా చెప్పగలను, అని రాశారు. ('. the episode of the suicide of 3000 Brahmins is nowhere in the Mysore gazette and as a student of history of Mysore was quite certain 38