పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఖరీదైన దుస్తులను టిపూ అందాచేశారు. తండ్రి హెదర్‌ అలీచేత శంఖుస్థాపన చేయబడిన కాంజీవరం గోపురాలయం నిర్మాణాన్ని ఎంతో శ్రద్ధతో టిపూ పూర్తి చేయించారు. ఈఆలయ నిర్మాణానికి 10 వేల నాణాలను విరాళంగా అందచేశారు. అనంతరం అక్కడ జరిగిన రథోత్సవంలో టిపూ స్వయంగా పాల్గొన్నారు. ఆలయాల అజమాయిషికి టిపూ ప్రత్యేకంగా ఒక శాఖ ఏర్పాటు చేశారు. మఠాలకు సంబంధించిన ఆస్తుల మంచి చెడ్డలను ఆ శాఖాధికారులు పర్యవేక్షించేవారు.ఆలయాల పరిరక్షణకు కూడ పలు చర్యలు తీసుకున్నారు. ఆయన సైన్యం దిండిగల్‌ కోటమీద దాడి చేసినప్పుడు కోటలోని ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండ ఫిరంగిదళం దాడులు జరపాలని, తన సైనికులకు, సైనికాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. టిపూ ప్రాసాదం సమీపాన ఒకవైపు మసీదు ఉంది. ఆ మసీదును ఆయన 1790 జూన్‌ మాసం 4 వ తేదిన కట్టించారు. ఆ ప్రాసాదానికి మరొకవైపున శ్రీరంగనాధస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమెనది. ఆ పరిసరాలలో మరికొన్నిఆలయాలున్నాయి. నమాజుకు రమ్మని మసీదునుండి వినపడే పిలుపుకు ఆయన ఎంతటి ప్రాధాన్యం యిచ్చేవారో శ్రీరంగనాధాస్వామి ఆలయం, ఇతర ఆలయాలనుండి వినవచ్చే జేగంటలకు టిపూ అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం అల్పాహారం తీసుకునే ముందు శ్రీరంగనాధాస్వామి ఆలయాన్ని సందర్శించడం ఆయన అలవాటని, ఈ విషయంలో ఆయన మైసూరు ప్రబువుల ఈ సంప్రదాయాన్ని అనుసరించారని ప్రముఖ చరిత్రకారుడు శ్రీ బి.ఎన్‌. పాండే తన Aurangzeb and Tipu Sultan-Evaluation of their Religious Policies గ్రధంలోపృర్కొన్నారు. (..." Tipu Sultan, as was customary with the rulers of Mysore, daily visited the temple of Lord Ranganatha located inside the fort of Srirangapatnam, before taking his break fast." - Page 19)

బలవంత మతాంతీకరణలకు ముస్లిం రాజులు పాల్పడ్డారంటూ టిపూ మీద కూడ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఓ పథకం ప్రకారంగా టిపూ అంటే ముస్లిమేతరులలో విద్వేషం కలిగించేందుకు ఆంగ్లేయ రచయితలు, ఆ తరువాతి కాలంలోకొందరు స్వదేశీ రచయితలు ప్రచారంలో పేట్టారు. ఈ వాదానలను పూర్వపక్షం చేస్తూ ప్రముఖ చరిత్రకారుడు ఆర్‌.సి.మజుందార్‌ తన An Advance History of India లో '..he was not fierce bigot...Though a pious Muslim, he did not attempt any wholesale conversion of his Hindu subjects...' అని వ్యాఖ్యానించాడు. 34