పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

ఇస్లాం విగ్రహారాధానకు వ్యతిరేకం అయినా, ఆయన మాత్రం తన రాజ్యంలో విగ్రహారాధనను సహంచటం మాత్రనమే కాకుండ ముస్లిమేతరుల ఆలయాలను, చర్చీలను,ఆయా సాంఫిుక జనసముదాయాల ప్రజలను ప్రోత్సహించారు. మైసూరు రాజ్యంలో గల పలు ఆలయాలకు ఆయన ప్రతి ఏటా గ్రాంటులను, ప్రత్యేక నిధులను సమర్పించారు. పూర్వం మైసూరు రాజులు పాిటించిన నియమాలను, ఒరవడిని ఆయన కొనసాగించారు. ఈ మేరకు ఆలయాలకు సంబంధించి 156 ఫర్మానాలు జారీచేశారు.ప్రముఖ శృంగేరి మఠం స్వామీజీతో పలు ధార్మిక, సామాజిక విషయాలను ప్రస్తావిస్తూ,కన్నడంలో టిపూ 30 లేఖలు వ్రాశారు. ప్రసిద్ధిచెందిన లక్ష్మీనాధస్వామి ఆలయం (కలాల), నారాయణస్వామి ఆలయం (మేల్కోట్), శ్రీ కంఠేశ్వర ఆలయం, నజుండేశ్వరి ఆలయం (నంజూగూడ్‌) తదితర ఆలయాలకు అవసరమగు వెండి, బంగారు పాత్రలు, ఆభరణాలు,

మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf

ప్రతి రో ప్రాతóకాలాన టిపూ సందర్శించే శ్రీరంగనాథ ఆలయం 33