పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌ ‘ He was the first Indian leader (Years before Gandhiji) who believed in non-cooperation with foreigners. He wrote to his officers in Calcutta not to purchase goods from English traders, thus they would automatically be compelled to leave the country.’


                                      సాహిత్యాభిలాషి

తండ్రి హైదర్‌ ఆలీ శ్రద్ధవలన టిపూ విద్యాధికుడు కావటమే కాకుండ, సాహిత్యాభిలాషిగా కూడ పేర్గాంచారు. పండితులను గౌరవించటం, సాహిత్య సభలను నిర్వహించటం, గ్రంథాలను రాయించటం పట్ల టిపూ ఎంతో ఆసక్తి చూపారు.కవి,పండితులకు ఆర్థిక వెసులుబాటు కల్పించారు. ప్రత్యేకాంశాలలో పేరొందిన పండిత ప్రముఖులను ఆహ్వానించి 45 ఉపయుక్త గ్రంథాలను రాయించారు. టిపూ స్వయంగా రచయిత. ఆయన కూడ ఉర్దూ భాషలో గ్రంథాలు రాశారు. 1793లో ' Fauji Akhbar ' అను ఉర్దూ వారపత్రికను ఆయన ప్రారంభించారు. ఈ పత్రిక ప్రచురణ నిమిత్తం ఆయన అరబిక్‌ టైపుతో ప్టింగ్ ప్రెస్‌ను కూడ ఏర్పాటు చేయించారు. ఆనాడు ఫారశీ దార్బారు భాష ఆయనప్పికి సామాన్య ప్రజల భాషగా ప్రాచుర్యం పొందిన ఉర్దూ భాషలో ఆయన పత్రికను తీసుకరావటం విశేషం.పౌజీ అక్బార్‌ను ఆయన జీవిత చరమాంకం వరకు నడిపారు. ఈ పత్రిక టిపూ సెన్యానికి

టిపూ స్వదాస్తూరి

29