పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అవసరమగు సాంకేతిక పరిజ్ఞానాన్ని బయట నుండి సంపాదించేందుకు, మిత్ర రాజ్యాలతో వాణిజ్య సంబంధాలను పటిష్ట పర్చేదుకు, టిపూ ఎంతో బుద్ధి కుశలతతో వ్యవహరించి విజయం సాధించారు. కచ్‌, మస్క్‌, పెరూ, ఒర్మాజ్‌, జిద్దా, బసరా, ఎడెన్‌ రాజ్యాలలో వర్తక-వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేయటమేకాక, చైనా, ప్రాన్స్‌, టర్కీ, ఇరాన్‌ లాింటి దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పారు.

' స్వదేశీ ' ఉద్యామకారుడు

టిపూ శతాబ్దం క్రితమే స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జాతీయోద్యమంలో భాగంగా మన దేశంలో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం కంటె ముందుగా టిపూ ఆ ఆలోచనను తన గడ్డ మీదకు తీసుకవచ్చారని చెప్పవచ్చు.ఆయన విదేశీ వర్తకాన్ని ఏమేరకు ప్రోత్సహించినా బ్రిీటిషర్ల వస్తువుల వాడకాన్ని మాత్రం అంగీకరించలేదు. వలస పాలకుల వస్తులన్నిటినీ టిపూ తన రాజ్యంలో నిషేధించారు.ప్రభుత్వ పరంగా ఇంగ్లాండు నుండి ఎటువంటి వస్తువును రానివ్వలేదు. ఇంగ్లాండు వర్తకుల నుండి ఎటువింటి వస్తువులను కొనరాదంటూ, ప్రభుత్వ వ్యాపార ప్రతినిధులకు ప్రత్యేక ఆదేశాలను జారీచేశారు. ఆ కారణంగా ఇంగ్లాండు దిగుమతులను కాదన్నారు. టిపూ తన వ్యక్తిగత వస్తువులలో ఇంగ్లాండు వస్తువులను నిషేధించారు. ఈ విషయమై ఆయన తన వారికి నిర్ధుష్టమైన ఆదేశాలిచ్చారు. ఆయన భారతీయ దుస్తులను మాత్రమేధరించారు. మద్రాసునుండి కంపెనీ వ్యాపారులు విక్రయిస్తున్న ఉప్పును కొనుగోలు చేయవద్దని ప్రత్యేక ఆజ్ఞలు జారీచేశారు. ఇంగ్లాండు వర్తకుల మీద ఆయన ఆంక్షలు విధించారు. సామాన్య ప్రజల వలె వారు వ్యవహరించ వీలు లేకుండ చేశారు. పరిమితులు విధించారు. అవసరమైతే వారి ఆస్థిపాస్తులను జప్తు చేయడనికి కూడ ఆయన సిద్ధాపడ్డారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపారం దాfiరా మన దేశంలో ప్రవేశించి, స్వదేశీ రాజ్యాలను దిగమింగుతూ క్రమంగా విస్తరిస్తున్న వైనం వలన రానున్న ప్రమాదాన్ని పసిగట్టిన టిపూ ఈ వ్యాపారుల మీద ప్రత్యేక ఆంక్షలను విధించారు. బ్రిీష్‌ వర్తకుల సరుకులను కొనుగోలు చేయకుంటే, గత్యంతరంలేని పరిస్థితులలో కంపెనీ పాలకులు ఈ దేశం వదాలి వెడతారంటూ ఆయన భావించారు. ఈ విషయాన్నిముస్లి షంషుద్దీన్‌ అహమ్మద్‌ రేడియన్స్‌ వారపత్రికలో ( 1-7 ఆగస్టు,1999) రాసిన ఆంగ్ల వ్యాసంలో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు. 28