పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

                అంతర్జాతీయ వ్యవహారదక్షుడు

టిపూ 17 సంవత్సరాల పాటు సాగించిన పరిపాలనలో అత్యధిక సమయం తన రాజ్యాన్ని కబళించాలనుకుంటున్న బ్రిీటిషర్లను, నిజాం నవాబు, మరాఠాలను ఎదుర్కొంటూ గడిపినప్పటికీ, స్వదేశీ వ్యవహారాలను చక్కదిద్ధుకుంటూనే, అంతర్జాతీయ వ్యవహారాలను కూడ దక్షతతో నిర్వహించి చరిత్రకారుల ప్రశంసలను అందుకున్నారు.మాతృభూమి నుండి ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులను తరిమి కొట్టేందుకు పొరుగున ఉన్న నిజాం నవాబు, మరాఠా నాయకులు ఏకమై ఐక్య సంఘటనగా ఏర్పడేందుకు తనతో కలసి రావాల్సిందిగా కోరారు. బలమైన శక్తిగా ఎదుగుతున్న మైసూరు రాజ్య ప్రాభవ వైభవాన్ని సహించలేని స్వదేశీపాలకులు, ఆయనకు తోడ్పటు ఇవ్వకపోవటంతో విదేశీయుల వైపు దాష్టిసారించారు. శత్రువు శత్రువు, మిత్రుడు, అనే రాజకీయ సూత్రీకరణను అనుసరిస్తూ, తొలుత ఫ్రెంచ్‌వారిని, ఆ తరువాత టర్కీ, అఫ్గనిస్తాన్‌; ఇరాన్‌, దేశాధినేతల స్నేహహస్తం కోరారు. టిపూ వ్యవహార దక్ష్తత వలన ఈ దేశాధి నేతల నుండి అనుకూల స్పందన లభించింది. ఆనాడు అంతర్జాతీయ రంగాన బ్రిీటిషర్ల ప్రభ బాగా వెలిగిపోతున్నందున,కీలకమైన చివరి దశలో టిపూకు సహాయం లభించలేదు. ఫ్రెంచి వారు చాలాకాలం టిపూతో స్నేహం నెరపినప్పటికీ, ఎడు సంవత్సరాల తరువాత ఫ్రాన్స్‌- ఇంగ్లాండ్‌ మధ్యన కుదిరిన శాంతి ఒప్పందాన్ని సాకుగా తీసుకుని ఫ్రెంచి సైన్యాధితులు ఆత్యంత కీలక సమయంలో టిపూకు సహాయం చేయ నిరాకరించారు. బ్రిీషర్లను తరిమి క్టొాలన్న ఏకైక లక్ష్యంతో టిపూ నిరంతరర సాగించిన ప్రయత్యాల ఫలితంగా ఆయన సహాయానికి తరలి వసున్నట్టుగా ఒక దశలో నెపోలియన్‌ తెలిపారు. ఈ మేరకు టిపూకు నెపోలియన్‌ లేఖకూడ రాసాడు. ( "....You have been already informed of my arrival on borders of the sea, with an invincible army, full of the desire of delivering you from the iron yoke of England.." - TIPU SULTAN : HIS VISION AND MISSION, By Prof. B. Sheik Ali, Page. 14) ఆని టిపూకు రాసిన లేఖలో నెపోలియన్‌ పేర్కొన్నాడు. మాతృభూమిని కబళించాలనుకుంటున్న బ్రిీటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడనికి ఇతర దేశాల స్నేహస్తం కాంక్షించినట్టుగానే, దేశీయ వర్తక, వాణిజ్యాలు,ఎగుమతులు, దిగుమతులు, స్వదేశీ పరిశ్రమలు, ఆధునిక ఆయుధాల తయారికి 27