పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉద్యోగికి వారసులు లేనట్టయితే ఆకుటుంబానికి తగిన పొలం ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఆ పొలం చేసుకునే వారులేనట్టయితే, సదారు పొలాన్ని కౌలుకు చేయించుకుని అవసరాలు గడుపుకునే విధంగా ఏర్పాటు చేయమని ఆయన తన అధికారులకు స్పష్టంగా ఆదేశాలిచ్చారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు శతృవర్గానికి చెందిన వారైనప్పటికి టిపూ వారికి ఎటువంటి నష్టం కలిగించలేదు. పరాజిత రాజ్యాల ప్రజలను దోచుకోవటం హీనమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సైనికాధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 1783, 1785, 1787 లో టిపూ జారీ చేసిన ఆజ్ఞలలో, పరాజితప్రాంతాన్నిదోచుకోవడం ద్వారా విజేత సంపన్నంకావచ్చును కాని ఆ ఆచర్య సంపూర్ణ సెన్యాన్ని అగౌరవానికి గురిచేస్తుంది. యుద్ధం యుద్ధబూమికి మాత్రమే పరిమితం కావాలి.యుద్ధాన్ని ఆయాయక సామాన్య పౌరుల మీదకు తీసుకెళ్ళవద్ధు. పరాజిత ప్రాంతాల మహిళలను ఆదారించండి. ఆయా మతాలను గౌరవించండి. వృద్ధులకు, పిల్లలకు రక్షణ కల్పించండి, అని పేర్కొన్నారు. (‘ Looting a conquered enemy enriches a few. But impoverishes that nation and dishonours the entire army. Wars must be confined to battlefields. Do not carry them to innocent civilians. Honour their women, respect their religion, and protect their children and infirm ..’ - Aurangzeb and Tipu Sultan : B N Pandey, Page . 22)

పూర్వీకుల సాంప్రదాయలను గౌరవిస్తూనే అనేక ప్రజోపయాగకర సంస్కరణలకు టిపూ అంకురార్పణ చేశారు. సంస్కరణల అమలు విషయంలో వ్యక్తిగత కష్ట నష్టాలను ప్రజల వ్యతిరేకతను కూడ ఆయన ఖాతరు చేయలేదు. ఖురాన్‌ గ్రంథంలోని ప్రవచనాల ప్రకారంగా వ్యభిచారం, బానిసత్వం, బహు భతృత్వం, మధ్యపానాన్నినిషేధించారు. మలబారు మహిళలు నడుం పైభాగాన ఎటువంటిఆఛ్చాదన లేకుండ అర్ధనగ్నంగాతిరగటం గమనించి మహిళలంతా రవికలు ధరించాలని ఆజ్ఞలు జారీ చేశారు. ఈఆదేశాలను ధిక్కరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. కాళిమాత పేరుతో సాగుతున్న నరబలిని నిషేధించారు. ఫకీర్లు - సన్యాసులు మాదక ద్రవ్యాలను తీసుకోవటం తీవ్రమైన నేరంగా పరిగణించారు. పొగాకు సేవనం ఆనారోగ్యకరమని నిషేధించారు. ప్రతి వ్యక్తి పొదుపును అలవర్చుకోవాలని. అనవసర దుబారాను తగ్గించాలని, వ్యక్తి తనసంపాదానలో ఒక శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని విలాసాలకు ఖర్చు చేయరాదని ఖచ్చితమైన ఆజ్ఞలు జారీచేసారు. 26